logo
Published : 30/11/2021 06:29 IST

అన్నవరం.. భక్తజనసంద్రం..


వ్రతమాచరిస్తున్న భక్తులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని ఆలయ ప్రాంగణాలు భక్తజనసంద్రమయ్యాయి. కార్తికమాసంలో ఆఖరి సోమవారం కావడంతో స్వామిదర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రికే కొండపైకి వేలాది మంది భక్తులు చేరుకోగా రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున ఒంటిగంట నుంచి వ్రత టికెట్ల విక్రయాలు ప్రారంభించారు. రెండు గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలకు అనుమతించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. 10,811 వ్రతాలు, 47 కల్యాణాలు జరిగాయి. వ్రతాల ద్వారా రూ.54.23 లక్షలు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.29.54 లక్షలు, మొత్తం రూ.91.42 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈవో త్రినాథరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఎన్‌.సూర్యారావు నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం ఇచ్చారు. కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు కొండ దిగువన తొలిపావంచాల వద్ద స్వామిని దర్శించుకున్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని