logo

జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 23 Apr 2024 04:57 IST

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు నామపత్రాలు సమర్పించారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిల భారతీయ జనసంఘ తరఫున కావూరు శివవానందరెడ్డి, భాజపా అభ్యర్థి ములగపాటి శివరామకృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గాదేవిక, రాజానగరంలో జనసేన తరఫున బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా కట్టా కృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్‌లో కాంగ్రెస్‌ తరఫున బోడా లక్ష్మీవెంకటప్రసన్న, తెదేపా తరఫున ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, వైకాపా తరఫున మార్గాని భరత్‌రామ్‌, మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం గ్రామీణంలో జైభారత్‌ పార్టీ తరఫున మన్నం రఘురామ్‌, స్వతంత్ర అభ్యర్థిగా చింతలపల్లి పవన్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ తరఫున బాలేపల్లి మురళీధర్‌, తెదేపా తరఫున గోరంట్ల ఝాన్సీలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కొవ్వూరులో తెదేపా తరఫున ముప్పిడి వెంకటేశ్వరరావు, ముప్పిడి సుజాత, స్వతంత్ర అభ్యర్థులుగా తాతపూడి సుజయ్‌ప్రవీణ్‌కుమార్‌, మొల్లా కుమల అలియాస్‌ ఆరుగోలను కమల, నిడదవోలులో జనసేన తరఫున కందుల లక్ష్మీదుర్గేష్‌ప్రసాద్‌, గోపాలపురంలో స్వతంత్ర అభ్యర్థిగా కట్టా శ్రీలక్ష్మి నామపత్రాలు సమర్పించారు. జిల్లాలో ఈ నెల 18 నుంచి ఇప్పటివరకు పార్లమెంట్‌కి అయిదు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 48 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్‌ తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు నేటి వరకు అవకాశం

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): పోస్టల్‌ బ్యాలెట్‌కు ఈ నెల 23లోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీసుల్లో ఉండి విధులు నిర్వహించే వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. సోమవారం జిల్లాలోని రిటర్నింగ్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌ రోజున అత్యవసర సేవలు అందించాల్సి ఉన్నందున పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చని, దీనికి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారికి ఫారం-12 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా శాఖల వారీగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. 27న పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ, ఫారం-12 మార్పిడి ఉంటుందన్నారు. అంతర్‌ జిల్లాల ఫారం-12 మార్పిడి ప్రక్రియ ఈ నెల 28న ఉంటుందని, 30న పోస్టల్‌ బ్యాలెట్‌ ధ్రువీకరణ, మే 2న హోమ్‌ఓటింగ్‌ సందర్శన, రాష్ట్ర స్థాయిలో మే 3న ఇతర జిల్లాల అన్‌ఫోల్డ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల మార్పిడి, 4న జిల్లాలో అన్‌ఫోల్డ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల మార్పిడి జరుగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని