logo

నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది.

Published : 23 Apr 2024 05:09 IST

యువగళం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పాత తరం ఓటర్లతో పాటు కొత్తగా ఓటుహక్కు వచ్చిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థులు తమ హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే నాయకులు ఎలా ఉంటే తమ భవిత బాగుంటుందో వారి మాటల్లో వినిపించారు.


యువతకు మేలు జరగాలి..

నాయకులు ఎవరు వచ్చినా రాష్ట్ర అభివృద్ధితో పాటు యువత భవితను దృష్టిలో ఉంచుకోవాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి వారికి భరోసా కల్పించాలి. అన్ని శాఖల నుంచి నోటిఫికేషన్‌ విడుదల చేసి ఖాళీలను భర్తీచేస్తే కొంతవరకు సమస్యను పరిష్కరించుకోవచ్చు. కంపెనీలు ప్రారంభించడం కాకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టించేందుకు కృషి చేయాలి. రాబోయే నాయకులు నగరాభివృద్ధికి కృషి చేయాలి.

సీహెచ్‌ సీతారామనాయుడు, స్పెషల్‌ తెలుగు  


ఉద్యోగావకాశాలు ఏవి..

మాతృభాషా వికాసం కోసం కృషిచేసే నాయకులు రావాలి. తల్లి భాషకు విద్యావిధానంలో ప్రాధాన్యం ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. డిగ్రీ పూర్తిచేసిన యువత ఉద్యోగం కోసం ఏళ్లతరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు మారాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగావకాశాలు పెంపొందించే దిశగా బాటలు వేయాలి. అలాంటి నాయకుడికే నా ఓటు వేయాలని భావిస్తున్నా.

ఎ.దీపిక, బీఎస్సీ  


భవితకు భరోసా అవసరం..

విద్యావిధానంలో మార్పు తీసుకురావాలి. చదువు పూర్తిచేసిన యువతకు భవిత ప్రశ్నార్థకం కాకుండా చూడాలి. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు గెలిచాక అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించే నాయకులు కావాలి. చాలాఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. దీనిని అధిగమించాలి. కొత్తగా ఓటు హక్కు వచ్చిన సందర్భంలో మా ఆకాంక్షలు నెరవేర్చే పాలకులు ఉండాలని భావిస్తున్నా.

బి.ఆషా, బీఏ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని