logo

అట్టహాసంగా నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు.

Published : 25 Apr 2024 05:34 IST

న్యూస్‌టుడే బృందం

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ,  కాకినాడ జిల్లాల్లో నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులు హడావుడి చేశారు.


నియోజకవర్గం: జగ్గంపేట

ఆర్వోకు నామపత్రం అందజేస్తున్న నెహ్రూ

అభ్యర్థి: జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
పార్టీ: తెదేపా (ఎన్డీఏ కూటమి అభ్యర్థి)
కేసులు: కాకినాడ త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 2, కోరుకొండ పీఎస్‌ పరిధిలో 1
స్థిరాస్తుల విలువ మొత్తం: జగ్గంపేట మండలం ఇర్రిపాక ఇల్లు, ఖరీదు రూ.60 లక్షలు
బంగారం: 480 గ్రాములు, వీటి విలువ సుమారు రూ. 30 లక్షలు
చరాస్తుల విలువ: రూ.3.6 లక్షల నగదు తోపాటు బోలోరా వాహనం ఆయన సతీమణి జ్యోతుల మణి పేరున రూ.2.7 లక్షల నగదు, ఇన్నోవా వాహనం,
అప్పులు: నెహ్రూ పేరున రూ.1,31,000, భార్య రూ.1,23,753 అప్పు ఉంది.


నియోజకవర్గం: అనపర్తి

అనపర్తిలో ఆర్వో మాధురికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న సూర్యనారాయణరెడ్డి

అభ్యర్థి: డా.సత్తి సూర్యనారాయణరెడ్డి
పార్టీ : వైకాపా
విద్యార్హతలు: ఎంబీబీఎస్‌, ఎమ్‌.ఎస్‌ జనరల్‌ సర్జన్‌
చరాస్తులు: రూ.2.27 కోట్లు భార్య పేరు మీద: రూ.1.60 కోట్లు, హెచ్‌యూఎఫ్‌: రూ.59.59 లక్షలు.
స్థిరాస్తులు: రూ.11.92 కోట్లు, భార్య పేరు మీద: రూ.2.86 కోట్లు, హెచ్‌యూఎఫ్‌: రూ.6.66 కోట్లు.
అప్పులు: రూ.1.63 కోట్లు


నియోజకవర్గం: రాజమహేంద్రవరం గ్రామీణం

ఆర్వో తేజ్‌భరత్‌కు నామపత్రం ఇస్తున్న శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

అభ్యర్థి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
పార్టీ: వైకాపా
విద్యార్హత: బీఏ
కేసులు : ఎటువంటి కేసులు లేవు.
మొత్తం ఆస్తులు: భార్యాభర్తలకు కలిపి రూ.7.28 కోట్లు
వార్షిక ఆదాయం: రూ.27,31,860
చరాస్తుల విలువ: 65.58 లక్షలు (1.10 కిలోల బంగారం, 22 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి)
స్థిరాస్తి: మంత్రి పేరు మీద రూ.6.63 కోట్లు
అప్పులు: రూ.1.40 కోట్ల

అందులో రూ.94 లక్షలు తన కుమారుడు నరేన్‌ వద్ద రుణం తీసుకున్నట్లు చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని