logo

ggggddd: వైకాపా మేనిఫెస్టో అంతా బూటకం

 వైకాపా ఎన్నికల మేనిపెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అదంతా బూటకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. 

Published : 28 Apr 2024 18:53 IST

తాళ్లపూడి: వైకాపా ఎన్నికల మేనిపెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అదంతా బూటకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని ప్రక్కిలంక, పైడిమెట్ట గ్రామాల్లో మాజీ ఎంపీపీ కోట్నీసు, మండల తెదేపా మాజీ అధ్యక్షుడు నాయుడు హనుమంతురావు ఆధ్వర్యంలో ఆదివారం ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.   అయిదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేయక ప్రజలను మోసం చేశారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అమలు చేసే పథకాలతోనే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు ఒరిగంటి శ్రీను, సంగం రాము, డేరా రాము, కందుల నాగు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని