logo

పంచాయతీ నిధులు తీసుకోవడంపై సర్పంచుల నిరసన

పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సర్పంచులు పాదయాత్ర చేపట్టారు.

Published : 02 Feb 2023 18:19 IST

కాకుమాను: పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సర్పంచులు పాదయాత్ర చేపట్టారు. వట్టిచెరుకూరు నుంచి కాట్రపాడు, చమళ్లమూడి, వింజనంపాడు, ఏటుకూరు గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తూ గుంటూరులోని కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పంచాయతీల్లో నిధులు లేకుండా పాలన ఎలా కొనసాగించాలని సర్పంచులు ప్రశ్నించారు. చిన్నపాటి మురుగు కాలువ పూడిక పనులు, వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయలేని దీనస్థితిలో పంచాయతీ సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలంటే డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. సర్పంచుల గౌరవ వేతనం రూ.3వేల నుంచి రూ.15వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని