logo

‘సంకల్పదీక్ష’కు వెళ్లకుండా అడ్డగింత

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరంలో తలపెట్టిన సంకల్ప దీక్షకు ఉపాధ్యాయులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 04 Feb 2023 06:40 IST

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరంలో తలపెట్టిన సంకల్ప దీక్షకు ఉపాధ్యాయులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి అనుమతులు లేవంటూ గుంటూరుతోపాటు మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో సుమారు 100 మంది యూటీఎఫ్‌ నాయకులకు పోలీసులు నోటీసులు అందించి దీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరులో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, యూటీఎఫ్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎం.కళాధర్‌లకు వారి ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు అందజేశారు. కళాధర్‌ను అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు పిలుపించుకుని మధ్యాహ్నం 12 గంటలకు వదిలారు. ఈ సందర్భంగా కళాధర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రధాన నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆపినా పెద్దఎత్తున కార్యకర్తలు సంకల్ప దీక్షలో పాల్గొని విజయవంతం చేశారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసే హక్కును కాలరాయడం ప్రభుత్వానికి తగదన్నారు. అణచివేత వలన పోరాటం పెరుగుతుందే తప్ప తగ్గదని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని