logo

Nimmagadda: ‘గో బ్యాక్‌ నిమ్మగడ్డ’.. వాన్‌పిక్‌ భూముల పరిశీలనపై నిరసన

బాపట్ల జిల్లా వేటపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘గో బ్యాక్‌ నిమ్మగడ్డ’ అంటూ స్థానిక కూడలిలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.

Updated : 28 Aug 2023 08:33 IST

వేటపాలెంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

వేటపాలెం, న్యూస్‌టుడే : బాపట్ల జిల్లా వేటపాలెంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘గో బ్యాక్‌ నిమ్మగడ్డ’ అంటూ స్థానిక కూడలిలో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో వాన్‌పిక్‌ భూములకు సంబంధించి ఇంకా స్టేటస్‌ కో కొనసాగుతున్న సమయంలో వాన్‌పిక్‌ సంస్థ ఛైర్మన్‌ హోదాలో నిమ్మగడ్డ ప్రసాదు రెండు రోజుల క్రితం వాటికి కేటాయించిన భూములు పరిశీలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు నల్లదుస్తులు ధరించి నినాదాలు చేశారు. రైతుల భూములను వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నేతలు కొండయ్య, మచ్చా అయ్యప్పరెడ్డి, పండ్రాజు శంకర్‌, పల్లపోలు లోహియా, నడయార్‌, ముత్తు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని