logo

‘మంగళగిరి రూపురేఖలు మారుస్తాం’

ముఖ్యమంత్రి జగన్‌ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని  యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 23 Apr 2024 05:57 IST

చిలువూరులో మాట్లాడుతున్న లోకేశ్‌

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ మాదిరిగా తాము శవ రాజకీయాలు చేయమని  యువనేత, కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పెనుమూలితో మొదలు పెట్టి చిలువూరు, తుమ్మపూడిలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ, బీసీˆ, ఎసీˆ్స, ఎసీˆ్టలను తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టి చూసుకుంటుందని  అన్నారు. పెనుమూలి, చిలువూరు, కంఠంరాజుకొండూరు తదితర గ్రామాల రైతులు కోరుతున్నట్లు పెదవడ్లపూడి హైలెవల్‌ ఛానల్‌ను తామే పూర్తిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో మంగళగిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృధ్ధి చేసి చూపుతానని అన్నారు.  విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసర సరుకులు, ఆర్టీసీˆ ఛార్జీలు ఇలా అన్ని పెంచుతూ ముఖ్యమంత్రి ప్రజలకు రూ. 10 ఇచ్చి రూ. 100 లాగేస్తున్నారని విమర్శించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రంజాన్‌తోఫా, దుల్హన్‌ వంటి ఎన్నో పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. నాయకులు మహమ్మద్‌ నిజాముద్దీన్‌, చిలువూరు మాణిక్యం, షేక్‌ జబీన్‌, యేళ్ల జయలక్ష్మి, సీˆతారామయ్య, మరియరోజమ్మ, మద్దుకూరు శ్రీనివాసరావు, పినపాటి కరుణాకరరావు, జీవన్‌, నూకతోటి రవి, మూడు పార్టీల మండల అధ్యక్షులు కేసంనేని శ్రీఅనిత (తెదేపా), పసుపులేటి శ్రీనివాసరావు(జనసేన), పసుపులేటి గణేష్‌ (భాజపా), నర్రా శ్రీనివాసరావు, లక్ష్మీదేవి తదితరులున్నారు.

సమస్యల ఏకరవు..: మూడు గ్రామాల్లో ఎసీˆ్స, హిందూ శ్మశానవాటికలు అభివృధ్ధి చేయాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా రుణాలివ్వాలని, ఉద్యానశాఖ ద్వారా గతంలో మాదిరిగా పరికరాలు ఇవ్వాలని, డొంకరోడ్లు బాగుచేయాలని, చిలువూరులో సపోట, నిమ్మ రైతులకు ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటివి పెట్టాలని స్థానికులు కోరారు. చిలువూరులో ప్రభుత్వ స్కూలు ఏర్పాటు చేయాలని, గంజాయిని అరికట్టాలని, గేటు వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని, తమ గ్రామంలోనే స్థలాలు ఇవ్వాలని విన్నవించగా..పరిష్కారానికి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

గోల్డ్‌ హబ్‌ ఏర్పాటుతో అభివృద్ధి

మంగళగిరి: మంగళగిరిలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను తీసుకొస్తానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారాలోకేశ్‌ అన్నారు. మంగళగిరి మండలం కాజ సమీపంలోని ఏఆర్‌హోమ్స్‌, జాస్మిన్‌ అపార్టుమెంటు వాసులతో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నాకు ఒక ప్రత్యేకమైన విజన్‌ ఉందని తెలిపారు. దేశం మొత్తంమీద అభివృద్ధికి చిరునామాగా మంగళగిరిని తయారు చేస్తానని చెప్పారు. పాతికేళ్లుగా మురుగుడు హనుమంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రజల జీవితాల్లో వీరి వల్ల ఎటువంటి మార్పు లేదన్నారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఎక్కువమంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారికోసం వంద ఎకరాల్లో గోల్డ్‌హబ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సిమెంటు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాలేజీల్లో విద్యాదీవెన కింద ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు హాల్‌ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు వివరించారు. స్పందించిన ఆయన ఫీజు రియంబర్స్‌మెంట్‌ విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంబేడ్కర్‌ విదేశీ విద్య, బెస్ట్‌ ఎవైల్‌బుల్‌ స్కూల్స్‌ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు.

యువతకు స్థానికంగా ఉపాధి కల్పిస్తాం

దుగ్గిరాల: యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం ఆయన స్థానిక సీˆసీˆఎల్‌ కర్మాగార యాజమన్యం, కార్మికులను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిశ్రమల ఏర్పాటుకు మెరుగైన విధానాన్ని తీసుకువస్తామని ఆయన భరోసా ఇచ్చారు.  పరిశ్రమల ఏర్పాటు ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని