logo

‘అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 29 Apr 2024 06:19 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పద్మశాలీయ బజారులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రచ్చబండలో పలువురు అగ్రిగోల్డ్‌ బాధితులు తమ సమస్యను లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ ప్రభుత్వంలో తమను అసలు పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారికి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు పట్టాలిప్పిస్తామని, భూగర్భ డ్రెయినేజీ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి ఇంటికీ శుద్ధ జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క నెల రోజులు ఓపిక పడితే రూ. 4 వేలు పింఛను అందుకోవచ్చన్నారు.

అన్నీ నాటకాలే..‘సీఎం జగన్‌ అద్భుతమైన నటుడు. 2019లో కోడికత్తి, ఆ తర్వాత బాబాయ్‌ హత్య, ఇప్పుడు గులకరాయి డ్రామాలు చూస్తున్నాం’ అని విమర్శించారు. రాయి ఘటనపై తొలుత బాధపడ్డానని, తర్వాత అసలు విషయం అది స్పెషల్‌ గులకరాయి అని తెలిసిందని ఎద్దేవా చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇక్కడి ప్రజలు గెలిపిస్తే హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు తెస్తానని, అందుకే జగన్‌ను ‘జరుగు జగన్‌ జరుగు’ అంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని