గ్యాస్ గీజర్.. విషవాయువుతో హడల్
ఎల్పీజీ గ్యాస్ గీజర్లను వినియోగిస్తున్నారా..? వెంటిలేషన్ లేని ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేశారా..? తస్మాత్ జాగ్రత్త..
ఇరుకైన శౌచాలయాలు, వెంటిలేషన్ లేని చోట్ల వాడొద్దు
గ్యాస్‌తో పనిచేసే గీజర్
ఈనాడు, హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్ గీజర్లను వినియోగిస్తున్నారా..? వెంటిలేషన్ లేని ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేశారా..? తస్మాత్ జాగ్రత్త.. గీజర్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్‌తో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవడంతో పాటు లీకేజీలు జరిగితే ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి కూడా చొరబడని ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటంతో విద్యుత్ సరఫరా లోపాలతో పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుదని హెచ్చరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఉదంతాలు.. గ్యాస్ గీజర్ నుంచి వెలువడిన విషవాయువులు పీల్చిన భార్యాభర్త మరణించగా వారి కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఇటీవలే రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో జరిగింది. ముంబయిలో జరిగిన ఇదే తరహా ఘటనలో ఇద్దరు మరణించగా.. బెంగళూరులోనూ 35 ఏళ్ల మహిళ, 7 ఏళ్ల చిన్నారి మృతి చెందింది.
ఎలా పనిచేస్తుందంటే: గ్యాస్ గీజర్ విద్యుత్ గీజర్ కంటే భిన్నమైంది. ఇది ఎల్పీజీ ద్వారా నడుస్తుంది. వెంటిలేషన్ లేని బాత్‌రూమ్‌లలో ఏర్పాటు చేస్తుండటంతో గీజర్ల నుంచి వెలువడుతున్న కార్బన్ మోనాక్సైడ్ మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషంతో సమానమైన ఈ వాయువును పీల్చితే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతోపాటు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
-అశోక్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధి
రంగు, వాసన లేని లక్షణాలతో ఉండే కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీకవుతున్నా గుర్తించలేము. తెలియకుండానే పీల్చడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం ద్వారా లీకేజీ మరేదైనా సమస్య ఉంటే ముందుగానే గుర్తించొచ్చు. గ్యాస్ గీజర్‌ను రోజంతా వినియోగించడం మంచిది కాదు. నిరంతరాయంగా వినియోగిస్తే ప్రమాదాలు జరుగుతాయి. బాత్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తే స్నానం చేయడానికి వెళ్లే ముందు గీజర్‌ను స్విచ్ ఆఫ్ చేయాలి. అనుకోకుండా ప్రమాదం జరిగితే వెంటనే బాధితులను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండవు. తర్వాత ఆసుపత్రికి తరలించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు
-
Crime News
Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!
-
General News
Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!