logo

ఎందుకీ నిర్లిప్తత.. ఓటేద్దాం పదపద

ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్‌ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది.

Published : 29 Apr 2024 04:56 IST

నగరంలో తగ్గుతున్న పోలింగ్‌ శాతం
ఈసారి పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు
ఆందోళన కలిగిస్తున్న వేసవి సెలవులు, ఎండలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి ఎన్నికల్లో రాజధానిలో పోలింగ్‌ శాతం తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రకరకాల కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నా ఓటర్ల నిర్లిప్తత సైతం దీనికి తోడవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2019 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు 4 శాతం పోలింగ్‌ తగ్గిందంటే నగరంలో తీరు అర్థం చేసుకోవచ్చు. మే 13న జరిగే ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ, ఎన్‌జీవోలు ముందుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.

  • హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మరీ తక్కువగా కేవలం 39.49 శాతమే ఓటు వేశారు. ః గత ఎంపీ ఎన్నికల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో పోలింగ్‌ సగటు 45.26 శాతం నమోదైంది.

ప్రధాన కారణాలు ఇవే...

  • ఏటా 4-5 లక్షల మంది ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. స్థానిక అవసరాల కోసం ఇక్కడ ఓటు హక్కు పొందుతుంటారు. ఇందులో చాలామందికి సొంతూరిలోనూ ఓటు ఉంటుంది. ఎన్నికలప్పుడు స్వగ్రామాలకు వెళ్లడానికే మొగ్గు చూపుతుంటారు.
  • వేసవి సెలవుల్లో ఎన్నికల కారణంగా చాలామంది పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతుంటారు. ఈసారీ అదే పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి.
  • అద్దె ఇళ్లలో ఉన్న వారు తరచూ మారుతుండటం సాధారణమే. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడా కొత్తగా ఓటు హక్కు పొందుతుంటారు. ఇలా రెండుచోట్ల ఓటు ఉంటుంది. గతంలో ఉన్న ఓటును రద్దు చేసుకోకపోవడంతో అది చెలామణిలోనే ఉంటుంది.
  • ఈసారి ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేడితో జనం బయటకు వచ్చి వరుసలో నిలబడి ఓటేసేందుకు వస్తారో లేదోననే సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని