logo

మోదీ హయాంలో ముస్లింలను అనుమానిస్తున్నారు

దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్‌ హైదరాబాద్‌ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

Published : 30 Apr 2024 01:56 IST

మాట్లాడుతున్న ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

గోల్కొండ, న్యూస్‌టుడే: దేశంలో నేడు ముస్లింలను అనుమానపు దృష్టితో చూస్తున్నారని, అలాంటి పరిస్థితిని ప్రధాని మోదీ తీసుకొచ్చారని మజ్లిస్‌ హైదరాబాద్‌ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి టోలిచౌకి ఎండీలైన్స్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్‌కు చెందిన ప్రజ్వల్‌ రేవణ్న అనే వ్యక్తి మహిళలపై రెండు వేల అసభ్యకర వీడియోలు చేశారని, అతనికి మద్దతుగా మోదీ ఎన్నికల ప్రచారం చేశారన్నారు. నారీశక్తి అని పదేపదే పలికే ప్రధాని నారీమణులను అవమానించిన వారి పక్షాన నిలబడటం ఏంటని ప్రశ్నించారు. భాజపా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్‌ చట్టాన్ని తొలగిస్తామంటున్నారని, మతతత్వశక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని కోరారు. సమావేశంలో కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని