logo

తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది.

Published : 30 Apr 2024 02:06 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో పెండ్యాల కిషన్‌శర్మ(శ్రీవరదాభ్యుదయము), వచన కవితలో మెర్సీ మార్గరేట్‌ (కాలం వాలిపోతున్న వైపు), బాల సాహిత్యంలో ఎన్నవెళ్లి రాజమౌళి (ఆటా-పాటా), కథానిక ప్రక్రియలో కొట్టం రామకృష్ణారెడ్డి (నూనె సుక్క), నవలలో డా.తాళ్లపల్లి యాకమ్మ(కెరటం), సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు (అనుభూతి-అన్వేషణ), నాటకం/నాటికల్లో పి.ఎ.దేవి (స్వాతంత్రోద్యమ వీరుల నాటకత్రయం), అనువాదం సాహిత్యంలో గురుమూర్తి గుబిలి(వీరయ్య), వచన రచన విభాగంలో సయ్యద్‌ నసీర్‌ అహమ్మద్‌ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌-ముస్లిం పోరాట యోధులు), రచయిత్రి ఉత్తమ గ్రంథ విభాగంలో చాగంటి తులసి (రంగంటే ఇష్టమే) గ్రంథాలు ఎంపికయ్యాయని వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు సోమవారం తెలిపారు. త్వరలో నాంపల్లిలోని వర్సిటీలో పురస్కారాల ప్రదానం ఉంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.20,116 నగదుతో సత్కరిస్తామన్నారు. సాధారణ పాఠకుల నుంచి కవులు, రచయితలు, విమర్శకులు, నాటకకర్తల సూచనలు స్వీకరించి 2019, 2020, 2021 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాలు ఎంపిక చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని