logo

ఓటరు సౌలభ్యతే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది.

Updated : 30 Apr 2024 05:57 IST

కొత్తగా 15 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
వసతుల కల్పనపై  ప్రత్యేక దృష్టి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ కొలిక్కి వచ్చాయి. ఒక అంకం పూర్తి కావటంతో అధికార యంత్రాంగం సజావుగా ఎన్నికల నిర్వహణ సాగేందుకు అన్ని విధాలా సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్లకు తగినట్లు కొత్త పోలింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటుచేస్తే ప్రస్తుతం సౌకర్యాలను కల్పించటంపై దృష్టి సారించారు.

పలువురు విన్నవించడంతో..

గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 1133 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటుచేయాలని పలువురు విన్నవించడంతో అదనంగా 15 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో తాండూరు నియోజక వర్గంలో 8, కొడంగల్‌ నియోజక వర్గంలో 7 ఉన్నాయి.  
నాలుగు నెలల్లో ఇలా.. : జిల్లాలో గత శాసన సభ ఎన్నికల్లో 9,60,376 మంది ఓటర్లు ఉండగా ఈనెల 26న ప్రకటించిన తాజా ఓటరు ముసాయిదా ప్రకారం 9,83,740 మంది తేలారు. ఈ నాలుగు నెలల్లో  23,364 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.  


ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు

చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు వస్తాయి. వీటి పరిధిలో 3306 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో  విధులు నిర్వహించటానికి ఈనెల 27న రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందిని కేటాయించారు. దాదాపు 13,600 మంది సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు.  

  • ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 20 రకాల సౌకర్యాలుండాలి. ముఖ్యంగా 24 గంటలు విద్యుత్తు సౌకర్యం మంచినీరు, మహిళలకు, పురుషులకు విడివిడిగా శౌచాలయాలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలి.  ఇటీవలే కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి సౌకర్యాల కల్పనపై కచ్చితంగా దృష్టి సారించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని