logo

గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర

కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు పేర్కొన్నారు. 

Updated : 23 Apr 2024 05:30 IST

ఏన్కూరు: ప్రచారం చేస్తున్న తాండ్ర వినోద్‌రావు

ఏన్కూరు, కొణిజర్ల, బోనకల్లు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు పేర్కొన్నారు.  ఏన్కూరు, కొణిజర్ల, బోనకల్లులలో సోమవారం రోడ్‌షో నిర్వహించారు.  తనను గెలిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నా స్థానిక పాలకులు వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోనకల్లులో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఆపేందుకు, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.  పదేళ్లలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు పూర్తిచేసే విధంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాంసుందర్‌నాయక్‌, నెల్లూరి కోటేశ్వరరావు, కొవ్వూరి నాగేశ్వరరావు, నల్లబోతు రమేశ్‌, తుప్పతి మల్లిఖార్జున్‌, జిల్లా నాయకులు చావా కిరణ్‌, నరుకుళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కల్లూరు: భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు  కల్లూరులో జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్కినేని రఘును కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పుల్లయ్యబంజరులో జాబిశెట్టి హాస్పిటల్స్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టరు శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీ బుర్రి భవానీ, నరసింహారావును కలిసి మద్దతు కోరారు. నంబూరి రామలింగేశ్వరరావు, రాఘవరావు, భాస్కర్ణి వీరంరాజు, పసుపులేటి సుబ్బారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని