logo

రూ.63 లక్షల నగదు సీజ్‌

ఖమ్మం రూరల్‌ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 28 Apr 2024 01:20 IST

పట్టుబడ్డ నగదును లెక్కిస్తున్న పోలీసులు

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఖమ్మం రూరల్‌ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పవన్‌ అనే వ్యక్తి కారులో హైదరాబాద్‌ వెళ్తుండగా శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ చేశారు. అతని వాహనంలో రూ.20,55,000 నగదు, 275 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు.

  • కొత్తగూడెం జిల్లాకేంద్రానికి చెందిన రజనీకాంత్‌ అనే వ్యక్తి శనివారం ఆర్టీసీ బస్సులో సూర్యాపేట జిల్లా కోదాడ వెళ్లి.. తిరిగి కొత్తగూడెం బయల్దేరాడు. వెంకటగిరిక్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు సాయంత్రం బస్సును తనిఖీ చేయగా రజనీకాంత్‌ వద్ద రూ.42,86,520 ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన నగదు, బంగారం ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పుష్‌కుమార్‌ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని