logo

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

Published : 29 Apr 2024 02:08 IST

మాట్లాడుతున్న భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు

తల్లాడ: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్‌సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురాంరెడ్డిని హైదరాబాద్‌ నుంచి దిగుమతి చేశారని, తాను లోకల్‌ వ్యక్తినని తెలిపారు. భారాస చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బూత్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలవాలని చెప్పారు. ఎంపీగా తనను గెలిపిస్తే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  భారాస అధినేత కేసీఆర్‌ తల్లాడలో మంగళవారం రోడ్‌షో నిర్వహిస్తారని పేర్కొన్నారు. భారాస శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకటలాల్‌,   దిరిశాల దాసురావు, బద్దం కోటిరెడ్డి, కేతినేని చలపతిరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బాణోతు మోహన్‌,   గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జీవీఆర్‌), రుద్రాక్ష బ్రహ్మం, తూము శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని