అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సినీఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు.
పరారీలో మరో నిందితుడు
రూ.35.50 లక్షలు విలువై ఆభరణాలు, కారు సీజ్
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ శ్రీరామ్, ఎస్సై జయశేఖర్, పోలీసుల అధీనంలో నిందితులు, కారు, ఆభరణాలు
ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తూ సినీఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగలను ఆదోని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆదోని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐ శ్రీరామ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం అరుణ్‌జ్యోతినగర్‌లో నివాసం ఉంటున్న సంధ్యారాణి ఇంట్లో 2022 జులై 15వ తేదీన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తాము స్వచ్ఛభారత్ ప్రతినిధులమని.. మీ ఇంట్లో డ్రైనేజీ పైపులైను వ్యవస్థ పరిశీలిస్తామని నమ్మబలికి ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉంచిన బంగారు ఆభరణాలు దొంగిలించుకెళ్లారు. బాధితురాలు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సీఐ శ్రీరామ్, ఎస్సై జయశేఖర్, కానిస్టేబుళ్లు కృష్ణయ్యనాయుడు, నరేంద్ర, చిన్నవెంకటేశ్వర్లు బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం శిగ్గావ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న యోగేశ్, కెంచప్పను అరెస్టు చేశారని తెలుసుకొని సీసీ ఫుటేజీ, ఫోటోలతో పరిశీలించగా.. పై ఇద్దరు నిందితులను ఆదోని బాధితులు గుర్తించారు. కాగా.. యోగేశ్, కెంచప్ప కర్ణాటకలోని హవేరి జిల్లా జైలులో రిమాండులో ఉండగా కోర్టు అనుమతి తీసుకొని నిందితులను కస్టడీలో తీసుకొని విచారించగా.. పై నిందితులు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైందన్నారు. కర్ణాటక రాష్ట్రం భద్రావతి తాలుకా దొడ్డేరి గ్రామానికి చెందిన యోగేశ్, కెంచప్ప, రవి బృందంగా ఏర్పడి ఆంధ్ర రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, గోవా తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. జిల్లాలో ఆదోని పట్టణంలోని అరుణ్‌జ్యోతినగర్‌లోని సంధ్యారాణి ఇంట్లో దొంగతనంకు పాల్పడగా.. అందుకు సంబంధించి 90 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదోని పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ, కర్నూలు నగరంలోని మిలిటరీ కాలనీలో, చిప్పగిరిలో, మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మాలపల్లె, కర్నూలు నగరం కొత్తపేట, బ్యాంకర్స్ కాలనీ, సప్తగిరి కాలనీల్లో చోరీలకు పాల్పడిన 500 గ్రాముల బంగారు ఆభరణాలు, 475 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మారుతి స్విప్ట్ కారును సీజ్ చేశామన్నారు. నిందితులు తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డులు సీజ్ చేశామన్నారు. మరో నిందితుడు రవి పరారీలో ఉన్నాడని.. గాలిస్తున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.35.50 లక్షలు ఉంటోందన్నారు. సొత్తు రీకవరికి కృషి చేసిన సీఐ, ఎస్సై, సిబ్బందిని డీఎస్పీ అభినందనలు తెలిపారు.
స్వచ్ఛభారత్ ప్రతినిధుల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం