logo

బాబు పర్యటనను విజయవంతం చేయండి

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 02:39 IST

కౌతాళంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న తిక్కారెడ్డి, బీటీ నాయుడు, పోలీసులు

గూడూరు, మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గూడూరులోని తెదేపా కార్యాలయంలో విలేకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆదివారం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో దాదాపుగా 20 వేల నుంచి 25 వేల మంది ప్రజలు హాజరవుతారన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, పట్టణ బాధ్యుడు గజేంద్రగోపాల్‌నాయుడు, నగర పంచాయతీ మాజీ వైస్‌ఛైర్మన్‌ రామాంజనేయులు పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన: గూడూరులో బాబు పర్యటన సందర్భంగా నూతన నగరపంచాయతీ సమీపంలో హెల్‌ప్యాడ్‌ను, పాత బస్టాండు వద్ద సమావేశ స్థలంతో పాటు రాత్రి బస చేయనున్న ప్రైవేటు పాఠశాలను తిక్కారెడ్డి, ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కౌతాళంలో ఆదివారం నిర్వహించనున్న చంద్రబాబునాయుడు ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక, హెలిప్యాడ్‌ను తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, మండలాధ్యక్షుడు ఉలిగయ్య శనివారం పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా సీఐ సురేష్‌, ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి వాహనాల పార్కింగ్‌, హెలిప్యాడ్‌, రూట్‌ మ్యాప్‌ను ముందస్తుగా పరిశీలించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌నాయుడు, చెన్నబసప్ప, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, కొట్రేష్‌గౌడు, టిప్పుసుల్తాన్‌, రామలింగ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని