logo

రూ.50.13 లక్షల విలువ చేసే బంగారం సీజ్‌

ఆదోని పట్టణంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముంబయికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ఆభరణాలు సీజ్‌ చేసినట్లు శిక్షణ డీఎస్పీ ధీరజ్‌, సీఐ తేజమూర్తి తెలిపారు.

Published : 28 Apr 2024 02:45 IST

పట్టుబడిన బంగారాన్ని చూపిస్తున్న శిక్షణ డీఎస్పీ ధీరజ్‌, సీఐ తేజమూర్తి, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : ఆదోని పట్టణంలో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముంబయికి చెందిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకొని ఆభరణాలు సీజ్‌ చేసినట్లు శిక్షణ డీఎస్పీ ధీరజ్‌, సీఐ తేజమూర్తి తెలిపారు. ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాల మేరకు పట్టణంలోని ఎంఎం రహదారిలోని గీతా మార్కెట్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముంబయికి చెందిన డానియల్‌ జైన్‌ను పోలీసులు, ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు హరేంద్ర, జనార్ధన్‌లు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేని రూ.50,13,508లు విలువ చేసే 785.446 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని