logo

జగన్‌ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Published : 29 Apr 2024 02:38 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

 

మద్దికెర, న్యూస్‌టుడే: ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. మద్దికెరలో ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విదేశాల్లోని నల్ల డబ్బును తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ రూ.15 కూడా వేయలేదన్నారు. కొందరు వెధవలు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో ప్రజలకు మేలు జరిగే అంశాలపై కాకుండా.. ప్రతిపక్ష నాయకులపై, వారి భార్యలపై, కుటుంబ సభ్యులపై కొడాలి నాని లాంటి వెధవలు తిడుతూ జగన్‌ మెప్పు పొందేందుకు కారుకూతలు కూస్తున్నారని రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. నాసిరకం మద్యంతో ప్రజలను దోచేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అనంతరం పెరవలి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నరసింహులు, గిడ్డయ్య, రామాంజనేయులు, వలీసాహెబ్‌, నాగరాజు, కోదండరాముడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని