logo

కూటమితోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులోఉమ్మడి జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు.

Updated : 29 Apr 2024 17:11 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులోఉమ్మడి జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..  రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్‌ అన్ని రకాలుగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సి నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం జనవరి నెలను జాబ్ క్యాలెండర్ నెలగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు.  రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.  దేశ విదేశాల్లో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు మన ఆంధ్రప్రదేశ్ ఉండటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం చేపట్టే పథకాలను గురించి తెలియజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని