logo

ప్రతి ఎకరాకు నీరందిస్తాం

తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 30 Apr 2024 00:34 IST

గిరిజనులు తెచ్చిన విల్లంభును గురిపెడుతున్న బుడ్డా

నారాయణపురం (బండిఆత్మకూరు), న్యూస్‌టుడే: తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బండిఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవళాపురం గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలో నాలుగు టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రెండో పంటకు సాగునీరు అందించకపోవడంతో రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మూడు టీఎంసీల నీరు ఉన్నా కూడా సాగునీరు అందించానని తెలిపారు. జగన్‌ రైతుల భూములను కాజేసేందుకే లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామన్నారు. ఎరుకలి కులస్తులు సమీపంలోని అడవిలోకి వెళ్లి ఎదురులు తెచ్చుకునేందుకు ఉన్నత స్థాయి అటవీ అధికారులతో కలిసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల సురేశ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు నందిపాటి నరసింహారెడ్డి, నాయకులు కంచర్ల మనోహర్‌ చౌదరి, పాలశంకర్‌, మల్లేశ్వరరెడ్డి, కొరకంచి శంకర్‌, వెంగళరెడ్డిపేట శ్రీను, బుగ్గరాముడు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

నారపురెడ్డి కుంట తండాకు చెందిన 70 గిరిజనుల కుటుంబాలు తెదేపా నాయకుడు పాలశంకర్‌ ఆధ్వర్యంలో బుడ్డా సమక్షంలో తెదేపాలో చేరాయి. ఈ మేరకు గిరిజనులు బుడ్డాకు విల్లంభును ఇచ్చి మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని