logo

లోక్‌సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి

లోక్‌సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ సూచించారు.

Updated : 23 Apr 2024 06:10 IST

కర్ణాటక భాజపా ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌

మాట్లాడుతున్న కర్ణాటక ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌, చిత్రంలో భాజపా రాష్ట్ర నేతలు శృతి, ఏవీఎన్‌రెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం,  : లోక్‌సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ సూచించారు. మహబూబ్‌నగర్‌లోని భాజపా కార్యాలయంలో సోమవారం మహబూబ్‌నగర్‌, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు, సహ కన్వీనర్లు, మండలాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశానికి అభయ్‌ పాటిల్‌ హాజరై మాట్లాడారు. మండలాల వారీగా ప్రచారాన్ని ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో 80 ఏళ్లు నిండిన వృద్ధ ఓటర్లను గుర్తించారా లేదా అని ఆరాతీశారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయిలో యువత ఓట్లను లక్ష్యం చేసుకొని ఇంటింటికి వెళ్లాలన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పదేళ్లలో భారత్‌ సాధించిన పురోగతిని వివరించి ఓట్లు అడగాలని కోరారు. అధిష్ఠానం నుంచి వచ్చిన జాబితా ఆధారంగా కేంద్ర పథకాలతో లబ్ధి పొందిన కుటుంబాల వద్దకు వెళ్లి వారు భాజపాకు ఓటేసేలా కృషి చేయాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గెలుపొందాలంటే బూత్‌ స్థాయి కన్వీనర్లు, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులు, మండలాల అధ్యక్షులు కీలక భూమిక పోషించాలని, మరో 20 రోజులు పరిగణలోకి తీసుకొని ప్రతి గంట కీలక సమయంగా బావించి భాజపా అభ్యర్థి గెలుపునకు శ్రమించాలని సూచించారు. ఒక్కో మండలంలో ఇరవై రోజుల పాటు మండలాల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలను వివరించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఎన్నికల ఇన్‌ఛార్జి ఏవీఎన్‌రెడ్డి, కన్వీనర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, కొండా ప్రశాంత్‌రెడ్డి, రమేశ్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని