logo

ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై

Updated : 28 Apr 2024 06:17 IST

మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ నగేశ్‌

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. సోమవారం సాయంత్రం వనపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం, ఆర్డీవో కార్యాలయం, పట్టణ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒకే సమయంలో ర్యాలీ నిర్వహించి పాలిటెక్నిక్‌ కళాశాల మైదానానికి చేరుకునేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ర్యాలీకి బందోబస్తు నిర్వహించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. కనీస వసతుల ఏర్పాటు బాధ్యతలను వనపర్తి పుర కమిషనర్‌కు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని