logo

‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’

కాంగ్రెస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్‌ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.

Published : 30 Apr 2024 03:44 IST

కొండపాకలో అభివాదం చేస్తున్న మంత్రి కొండా సురేఖ,  అభ్యర్తి నీలం మధు

కొండపాక గ్రామీణం, జగదేవపూర్‌, గజ్వేల్‌, ములుగు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్‌ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఆమె నీలం మధుకు మద్ధతుగా కొండపాక, కుకునూరుపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించిన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం రోడ్‌షో కార్యక్రమాల్లో ఆయనతో కలసి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 3 నెలల్లోపే 5 గ్యారంటీలను అమలు చేసిందిన్నారు. కేసీఆర్‌ కూతురు కవిత.. లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలు కెళ్లిందని.. ఆమె చేసిన వ్యాపారంతో ఎంతో మంది పేదలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ జలాశయాల్లో నిర్వాసితులకు అప్పటి కలెక్టర్‌, ప్రస్తుత భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదన్నారు. ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దెల సంతోష్‌ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ జిల్లా  అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, దుబ్బాక కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, లింగారావు, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. జగదేవపూర్‌ మండల కేంద్రంలో అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించారు.

 తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలతో ముందుకెళుతున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. గజ్వేల్‌ మండలం కొడకండ్లలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. సోమవారం రాత్రి మర్కూక్‌, పాములపర్తి గ్రామాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు రోడ్డుషో నిర్వహించారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కనకయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని