logo

తక్కువ నీటితో అధిక దిగుబడులు

తక్కువ నీటితో ఎక్కువ నేలలో సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఏపీఎంఐపీ పథక సంచాలకులు శ్రీనివాసులు సూచించారు.

Published : 09 Jun 2023 02:15 IST

గాలిపాలెంలో బిందుసేద్య పరికరాల అమరికను తనిఖీ చేస్తున్న ఏపీఎంఐపీ పీడీ బి.శ్రీనివాసులు

చేజర్ల, న్యూస్‌టుడే: తక్కువ నీటితో ఎక్కువ నేలలో సాగు చేయడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఏపీఎంఐపీ పథక సంచాలకులు శ్రీనివాసులు సూచించారు. మండలంలోని గాలిపాలెంలో నిమ్మతోటలకు అమర్చిన బిందు, సేద్య పరికరాలను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 3500 ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలను అందజేయనున్నట్లు వివరించారు. బిందు సేద్యానికి 90 శాతం, తుంపర సేద్యానికి 50 శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది లక్ష్యం కన్నా 20 శాతం అధికంగా పరికరాలు అందజేసినట్లు వివరించారు. అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీఎంఐపీ సిబ్బంది, పంపిణీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని