logo

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచండి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు

Published : 23 Apr 2024 05:01 IST

 నెల్లూరు గ్రామీణ: అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ
నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. నెల్లూరుగ్రామీణ పోలీసుస్టేషన్‌తో పాటు వెంకటేశ్వరపురంలోని సాలుచింతల, మెడికవర్‌ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను సోమవారం తనిఖీ చేశారు. ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీలు, సీఐలు ఉన్నారు.

పొదలకూరు : సార్వత్రిక ఎన్నికల సమయంలో సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అన్నారు. పొదలకూరు పోలీసుస్టేషను, రాంనగర్‌ కూడలిలో ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తనిఖీ కేంద్రం వద్ద కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాలని, రౌడీషీటర్లను ముందస్తుగా బైండోవర్‌ చేసుకోవాలన్నారు. ప్రజలు వారి ఓటుహక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని