logo

హతవిధీ..పట్టించుకునేవారేరీ!

నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్‌ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది.

Updated : 19 May 2024 04:04 IST

నెెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్‌ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో రొట్టెల పండగను రాష్ట్ర పండగగా గుర్తించి సుమారు రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసి అభివృద్ధి చేయగా.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం మాటలే తప్ప.. చేతల్లో ప్రగతిని చూపలేకపోయింది. దర్గా టెండరు నగదు సుమారు రూ. కోటికిపైగా తీసుకువెళ్లే వక్ఫ్‌బోర్డు అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండగా- దర్గా వక్ఫ్‌బోర్డు పరిధిలోకి వస్తుందని.. తమకేమీ సంబంధం లేదని నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా స్వర్ణాల చెరువు ఘాట్‌ కళా విహీనంగా తయారైంది. ఘాట్‌ పొడవునా వ్యర్థాలే దర్శనమిస్తుండగా.. కనీసం వాటిని శుభ్రం చేసేవారే కరవయ్యారు. దర్గా ఆవరణలోని పార్కు సైతం నిరుపయోగంగా మారింది. అందులోని పరికరాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఈ మొత్తం పరిణామాలు.. భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. రొట్టెల పండగ సమయంలో హడావుడి చేసే అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం షరామామూలుగా మారిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని