logo

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం

రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 19 May 2024 03:51 IST

దొంగ అరెస్టు... బంగారు నగల స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న నగర డీఎస్పీ

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 44.5 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను శనివారం స్థానిక బాలాజీనగర్‌ పోలీసుస్టేషన్‌లో నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అరవింద నగర్‌ మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో నివాసం ఉండే వేములపాటి శ్రీవల్లి కుటుంబం ఇంటికి తాళాలు వేరే ప్రాంతానికి వెళ్లారు. ఈ నెల 15న గుర్తుతెలియని దుండగుడు తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.1,42,400 విలువ చేసే 44 సవర్ల బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు. దీనిపై బాలాజీనగర్‌ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేలిముద్రలు సేకరించారు. దర్యాప్తులో నిందితుడు పాత దొంగ మీదూరి సునీల్‌గా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 2013 నుంచి జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. నేరం జరిగిన 48 గంటల్లో దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడంలో కృషి చేసిన బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరా నాయక్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని