logo

సీనియర్‌ సహాయకుల వాంగ్మూలం సేకరణ

నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌ రవీందర్‌ నిజామాబాద్‌లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్‌కు

Published : 20 May 2022 03:10 IST

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కీలక అడుగు ముందుకు పడింది. విచారణ అధికారి, మెదక్‌ జిల్లా రిజిస్ట్రార్‌ రవీందర్‌ నిజామాబాద్‌లోని డీఐజీ కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు సీనియర్‌ సహాయకుల వాంగ్మూలం సేకరించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలు, విచారణలో గుర్తించిన సమాచారంతో శాఖాపరమైన చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నాన్‌ లేఅవుట్లు, నాలా లేని భూములకు దస్తావేజులు పుట్టించిన వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి విచారణకు ఆదేశించడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. ఈక్రమంలో గతేడాది నవంబరులో విచారణ జరిపి ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. తాజాగా ఇద్దరు అధికారులు అక్రమాలు చేసినట్లు గుర్తించి ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ఆధారంగానే శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కలెక్టర్‌ విచారణ..
పాలనాధికారి సైతం ప్రత్యేకంగా 2021 ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో జరిగిన రిజిస్ట్రేషన్ల దస్తావేజుల వివరాలు సేకరించి విచారణ చేయిస్తున్నారు. ఇది దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని