logo

బరిలో ఉండేదెవరో?

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.

Updated : 29 Apr 2024 05:48 IST

నామినేషన్ల ఉపసంహరణకు నేటితో ఆఖరు 

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది సోమవారం తేలనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 25వ తేదీతో ప్రక్రియ ముగిసింది. భాజపా, కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులతో పాటు ఇతరులు మొత్తం 42 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 26న స్క్రూటిని ఉండటంతో అందులో పది మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతానికి 32 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

సంఖ్య 16 దాటితే..

నామపత్రాల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఈవీఎంలో 15 మంది అభ్యర్థులతో పాటు నోటా ఉంటుంది. 16 సంఖ్య దాటితే రెండో బ్యాలెట్‌ యూనిట్‌ అవసరమవుతుంది. ఎక్కువ మంది బరిలో ఉండే అవకాశం ఉండటంతో అధికారులు అదనపు బ్యాలెట్‌ యూనిట్లు సమకూర్చే పనిలో ఉన్నారు.

హోరెత్తనున్న ప్రచారం

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం హోరెత్తించనున్నారు. నగరం, పట్టణాలు, మండల కేంద్రాలు, పల్లెల్లో ఇలా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు ఇంటింటికి తిరిగి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. మే 13న పోలింగ్‌ ఉంది. దానికి ఒకరోజు ముందే ప్రచారానికి తెరపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని