logo

పొట్టంగిలో భారీ వర్షం

కొరాపుట్‌ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది.

Published : 29 Apr 2024 04:20 IST

మాలిపుట్‌ వద్ద జాతీయ రహదారిపై నేలకొరిగిన చెట్టు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పొట్టంగి- కుందిలి మార్గంలో మాలిపుట్‌ జాతీయ రహదారిపై చెట్టు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్ని మాపక సిబ్బంది చేరుకొని ఆ చెట్టును తొలగించారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని