logo

వైకాపా పతనం తప్పదు: కళా

రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు.

Published : 23 Apr 2024 03:46 IST

తెదేపాలో చేరినవారితో కళా వెంకటరావు, రామ్‌మల్లిక్‌ నాయుడు తదితరులు

గరివిడి, చీపురుపల్లి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. సోమవారం గరివిడి మండలం కె.పాలవలసలో జరిగిన బహిరంగ సభలో ఆ గ్రామ సర్పంచి మీసాల ప్రసాదరావు, తన అనుచరులు వంద మందితో కలిసి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వీరికి కళా వెంకటరావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గరివిడి ఎంపీపీ మీసాల విజయలక్ష్మి స్వగ్రామం కావడం, ఆమె భర్త విశ్వేశ్వరరావుపై సర్పంచి ఎన్నికల్లో ఈయన గెలుపొందడంతో గరివిడి మండలంలో అధికార వైకాపాకు  ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మండలంలోని నీలాద్రిపురం, వెదుళ్లవలస గ్రామాలకు చెందిన మరో 50 మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, సీనియర్‌ నాయకుడు కె.త్రిమూర్తులరాజు, నాలుగు మండలాల నాయకులు పైల బలరాం, ఎస్‌.సురేష్‌కుమార్‌, కోట్ల సుగుణాకరరావు, రౌతు కామునాయుడు, వెన్నె సన్యాసినాయుడు, వెంపడాపు రమణమూర్తి, రమణమూర్తి, సూర్యనారాయణ, ఎస్వీఎల్‌ఎన్‌.రాజు, రౌతు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని