logo

ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్‌వీ.అశోకన్‌ అన్నారు.

Published : 29 Apr 2024 05:22 IST

ఐఎంఏ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న అశోకన్‌, చిత్రంలో రాష్ట్ర అధ్యక్షుడు జేసీ.నాయుడు, పూర్వ అధ్యక్షుడు ప్రసాద్‌

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్‌వీ.అశోకన్‌ అన్నారు. నగరంలో కొత్తగా ఏర్పాటైన డాక్టర్‌ ఆశా సుబ్బారావు ఐఎంఏ హాల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీˆ.నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.ఫణీధర్‌, ఎలక్ట్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవీంద్రనాథ్‌, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు వీఎస్‌.ప్రసాద్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.అశోక్‌, ఎల్‌.శ్రీనివాసరావు, ఐఎంఏ ముఖ్య నాయకులు పి.గోపాలరావు, వి.మృత్యుంజయరావు, మహేంద్రగిరి, త్రినాథరావు, మధుకర్‌, వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని