logo

రాజీనామాకు ఒక్కరోజే గడువట!

వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..

Published : 30 Apr 2024 03:48 IST

వాలంటీర్లపై వైకాపా నేతల ఒత్తిడి

సాలూరు, న్యూస్‌టుడే: వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి.. ‘ప్రభుత్వ ఆదేశాలొచ్చాయి. తప్పనిసరిగా రాజీనామాలు చేయాలి.. మీకు పార్టీ తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తాం.. అని చెప్పినట్లు సమాచారం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు ఉన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత సమాచారం, పథకాల లబ్ధి వివరాలు వారి దగ్గర ఉన్నాయి. అందుకే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వినియోగిస్తే ఓట్ల లబ్ధి పొందవచ్చని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. సాలూరు పురపాలిక పరిధిలో పలు వార్డు వాలంటీర్లను వైకాపా కౌన్సిలర్లు కలిసి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు బుధవారం నాటికి రాజీనామా పత్రాలను సమర్పించాలని హుకుం జారీ చేశారట. రాజీనామాలపై పునరాలోచన చేయాలని కొంతమంది వాలంటీర్లు కోరినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి మూకుమ్ముడిగా రాజీనామాలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు