logo

బాబోయ్‌.. ఇదేం బాదుడు..!

అది సంతబొమ్మాళి మండలంలోని తీర గ్రామమైన మలగాం. వేట సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలే అక్కడన్నీ.. రెండు బల్బులు, ఒక ఫ్యాను మాత్రమే సగటున వినియోగిస్తున్నారు.

Published : 08 Jun 2023 05:54 IST

నిరుపేదలకు రూ.వేలల్లో విద్యుత్తు బిల్లులు
న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

రూ. 40,187 వచ్చిన బిల్లు

ది సంతబొమ్మాళి మండలంలోని తీర గ్రామమైన మలగాం. వేట సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుటుంబాలే అక్కడన్నీ.. రెండు బల్బులు, ఒక ఫ్యాను మాత్రమే సగటున వినియోగిస్తున్నారు. ప్రతినెలా రూ.వందల్లోనే కరెంట్‌ బిల్లు వచ్చేది. కానీ మేనెల బిల్లు రూ.వేలల్లో రావడం చూసిన వారికి పగలే చుక్కలు కనిపించాయి. ఇదేం దారుణమంటూ  అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబానికి రూ.20 వేలు, డాబా, రేకులు ఇళ్లలో ఉన్నవారికి రూ.40 వేలు వరకు బిల్లులు వేశారు.  

మలగాంలో విద్యుత్తు బిల్లులు చూపుతున్న వినియోగదారులు

* గ్రామానికి చెందిన కర్రి కృష్ణారావుకు రూ.40,187, కర్రి బాబుకు రూ.19,440, కర్రి గంగులుకు రూ.14,568, ఇప్పిలి తవిటమ్మకు రూ.16,750, లండ శాంతమ్మకు రూ.21,882, బుచ్చ.చిన్నమ్మకు రూ.6 వేలు, వడ్డి గురుమూర్తికి రూ.13,174, నౌపడ అప్పమ్మకు రూ.16,973, వడ్డి రాములు, లండ తులసమ్మలకు రూ.5 వేల చొప్పున విద్యుత్తు బిల్లులు వచ్చాయి.

ఎందుకిలా..

రీడింగ్‌ తీసే సిబ్బందిని ఇదే విషయమై ప్రశ్నించగా తామేం చేయలేమని విద్యుత్తు కార్యాలయాన్ని సంప్రదించాలంటూ సలహాలిచ్చి ఊరుకున్నారు. దీంతో చేసేది లేక బాధితులంతా అధికారుల వద్దకు వెళుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ శివకుమార్‌ను వివరణ కోరగా సాంకేతిక సమస్యల వల్లే అలా వచ్చి ఉంటుందని, అధిక బిల్లులపై ఫిర్యాదు చేస్తే తగ్గించే ఏర్పాటు చేస్తామని  తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని