logo

పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?

విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది.

Published : 29 Apr 2024 05:33 IST

బిబ్బిలిపేట పాఠశాలను పట్టించుకోని సర్కారు
తెదేపా పంచాయతీ నెపంతో నాడు- నేడులో చేర్చని వైనం

బిబ్బిలిపేట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు, గోడ

న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం: విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది.  ఆమదాలవలస మండలం బొబ్బిలపేట గ్రామంలోని పాఠశాలను మాత్రం కేవలం తెదేపా పంచాయతీ అనే నెపంతో ఇంత వరకు నాడు-నేడు పనులకు ఎంపిక చేయలేదు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ చదువులు సాగిస్తున్నారు.

వర్షం వస్తే సెలవే..

వర్షం పడితే బొబ్బిలపేట పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిందే. చిన్నపాటి వాన కురిసినా తరగతి గది కారిపోవడంతో విద్యార్థులు కుర్చోవడానికి స్థలం లేక ఉపాధ్యాయులు సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో చదువులు సక్రమంగా సాగడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు తెలియజేసినా ఇటు అధికారులు, అటు పాలకులు స్పందించలేదని సర్పంచి గొండు రమణతో పాటు గ్రామస్థులు వాపోతున్నారు. గతంలో ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులుండే వారు. ప్రస్తుతం 24 మంది పిల్లలు మాత్రమే చదువుతున్నారు. తెదేపా పంచాయతీ కావడంతో పాఠశాలలో విద్యా కమిటీ సైతం ఏర్పాటు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని