logo

వైభవంగా శ్రీకూర్మనాథుని కొట్నం దంపు

గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది.

Published : 19 May 2024 02:24 IST

గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో ప్రధాన అర్చకుడు చామర్ల సీతారామ నృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు స్వామి దైనందిన కార్యక్రమాల అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. సాయంత్రం కొట్నం దంపు, అగ్ని ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ఇన్‌ఛార్జి ఈవో గురునాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

న్యూస్‌టుడే, గార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని