logo

తండ్రిని చంపిన కుమారుడు

తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు.

Published : 23 Apr 2024 01:03 IST

సైదాపేట, న్యూస్‌టుడే: తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన అతను భార్యపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహనికి గురైన 15 ఏళ్ల పెద్ద కుమారుడు తండ్రిపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని