logo

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 28 Apr 2024 00:40 IST

ఎండ తీవ్రతకు గొడుగులు,

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, శుక్రవారం అత్యధికంగా ఈరోడులో 42 డిగ్రీలు, తిరుప్పత్తూర్‌లో 41.6 డిగ్రీలు, సేలంలో 41.5 డిగ్రీలు, కరూర్‌ పరమత్తితో 41, తాంబరం 41.0, తిరుత్తణి 40.4, వేలూర్‌, 40.3, తిరుచ్చి 40.1, నామక్కల్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. మే 1వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో పొడి వాతావరణం ఉంటుందని, మే 2న పశ్చిమ కనుమల జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని, ఇతర జిల్లాలు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది. మే 1 వరకు 2 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఉత్తర తమిళనాడులోని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగత్రలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని వివరించింది. 30వ తేదీ అత్యధికంగా వేడి గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆ రోజు మధ్యాహ్నం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడని హెచ్చరించింది. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది.

తలపై చున్నీలు వేసుకుని వెళ్తున్న కళాశాల విద్యార్థినులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని