logo

కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు

అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్‌బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.

Published : 19 Apr 2024 04:37 IST

వెన్నెలపాలెంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు

పరవాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్‌బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. పరవాడమండలం వెన్నెలపాలెం గ్రామంలోని గురువారం రాత్రి ఏర్పాటు చేసిన నియోజËకవర్గ స్థాయి తెదేపా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గంలో నిజాయతీతో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. గత ఐదేళ్లలోని. భూరికార్డుల ట్యాంపరింగ్‌, భూకబ్జాలు, అక్రమాలు, అన్యాయాలు చేసిన వైకాపా నాయకులు జనసేన, భాజపాలో చేరడానికి దొంగచూపులు చూస్తునారని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీల్లో చేర్చుకోవద్దుని బండారు డిమాండ్‌ చేశారు. సీఎం రమేశ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ తాను పెందుర్తిలోను, బండారు మాడుగులలో తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, తెదేపా నాయకులు బండారు అప్పలనాయుడు, పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

‘పెందుర్తి, మాడుగుల నాకు రెండు కళ్లు’..  

పెందుర్తిలో బండారుకు స్వాగతం పలుకుతున్న తెదేపా శ్రేణులు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. గురువారం ఆయన మాడుగుల వెళ్లే ముందు పెందుర్తి కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు అభిమానులు, తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. బండారు మాట్లాడుతూ పెందుర్తి, మాడుగుల తనకు రెండు కళ్లన్నారు. తాను ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడున్నా పెందుర్తి ప్రజలు, నమ్ముకున్న కార్యకర్తలను విడిచిపెట్టనని స్పష్టం చేశారు. పొత్తు ధర్మంగా పెందుర్తి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో తనను మాడుగులలో పోటీ చేయమని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ 96వ వార్డు తెదేపా అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు, మండల తెదేపా అధ్యక్షుడు కరక దేముడు, నాయకులు రెడ్డి నారాయణరావు, అవగడ్డ అప్పలనాయుడు, గండ్రెడ్డి నగేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని