logo

జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తా

అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 03:54 IST

కూటమి ఎంపీ అభ్యర్థి రమేశ్‌

పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేశ్‌, చిత్రంలో వంగలపూడి అనిత

పాయకరావుపేట, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. పేటలో శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోదీ పాలనతో దేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. అనిత మాట్లాడుతూ వైకాపా పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని చెప్పారు. ఎస్‌.రాయవరంలో శనివారం ఉపాధి హామీ పథకం కూలీలతో సీఎం రమేశ్‌ సమావేశమయ్యారు. ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రభుత్వం ద్వారానే అమలవుతోందని ఎంతమందికి తెలుసని కూలీలను అడిగారు. నిరుద్యోగులు ఉపాధి పనులకు హాజరు కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీజీ, బీటెక్‌, నర్సింగ్‌ చదివిన విద్యార్ధులు ఉద్యోగాలు లేక ఉపాధి పనికి వచ్చే పరిస్థితిని జగన్‌ కల్పించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం, ఇంటి నిర్మాణానికి అందించే రూ.1.50 లక్షలకు జగన్‌మోహన్‌రెడ్డి తన బొమ్మ వేసుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో తెదేపా మండల శాఖ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, అమలకంటి అబద్ధం, నేతలు గూటూరు శ్రీనివాసరావు, వి.వెంకటరమణ, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి, తోట నగేష్‌, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాకలపాటి రవిరాజు, బాదనపల్లి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని