logo

బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?

దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు.

Published : 29 Apr 2024 04:11 IST

రెండు రోజులపాటు వివరాల సేకరణ 
వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వృద్ధులు,

దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి సోమవారం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. మార్గదర్శకాలు రాగానే సచివాలయ ఉద్యోగుల ద్వారా మే 1 నుంచి 5వ తేదీలోపు పింఛను మొత్తం జమ చేయనున్నారు. జిల్లాలో 1,65,891 మంది సామాజిక పింఛనుదారులు ఉన్నారు. వీరికి నెలకు రూ.50కోట్లకుపైగా నిధులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీరిలో ఎంత మందికి బ్యాంకు ఖాతాలున్నాయి? ఎంత మందికి లేవు అనే వివరాలను ఈనెల 29, 30 తేదీల్లో సేకరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదివారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలు లేని వారితో పాటు అనారోగ్యంతో బాధపడేవారు, దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారి ఇళ్ల వద్దకెళ్లి పంపిణీ చేయనున్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని