logo

ఏజెంట్ల వివరాలు సమర్పించాలి

విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్‌, ఆర్‌ఓ మల్లికార్జున కోరారు.

Published : 30 Apr 2024 03:56 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్‌, ఆర్‌ఓ మల్లికార్జున కోరారు. ఫాం-8 ద్వారా రెండు సెట్ల వివరాలను అందజేయాలన్నారు. సోమవారం ఆయన సాధారణ పరిశీలకులు అమిత్‌శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్‌కుమార్‌తో కలిసి అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్‌ ఏజెంట్ల వివరాలను మే 8లోగా, మే 25లోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సమర్పించాలన్నారు. పరిశీలకులు అమిత్‌శర్మ, అమిత్‌కుమార్‌ మాట్లాడుతూ అభ్యర్థులు ఎలాంటి హింసను ప్రోత్సహించవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే సాధారణ పరిశీలకులు 63003 10152, పోలీసు పరిశీలకులు 63003 15841 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని