logo

చిరంజీవిని కలిసిన గంటా

భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో సినీ నటులు, మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

Updated : 19 May 2024 07:17 IST

చిరంజీవితో గంటాశ్రీనివాసరావు

పీఎంపాలెం, న్యూస్‌టుడే: భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో సినీ నటులు, మెగాస్టార్‌ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. చిరంజీవి పద్మవిభూషణ్‌ అవార్డు అందుకున్న నేపథ్యంలో అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ సరళి, తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు, జనసేనాని పవన్‌కల్యాణ్‌  ప్రభావం తదితరాలపై చిరంజీవి ఆరా తీశారు. భీమిలి నుంచి భారీ మెజార్టీతో గంటా గెలవాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని