logo

క్రీడలకు పుట్టినిల్లుగా తొర్రూరు

షూటింగ్‌బాల్‌ క్రీడాకారులకు క్రీడల్లో రెండుశాతం రిజర్వేషన్‌ కోసం కృషి చేస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో

Published : 29 Sep 2022 02:03 IST

ప్రసంగిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: షూటింగ్‌బాల్‌ క్రీడాకారులకు క్రీడల్లో రెండుశాతం రిజర్వేషన్‌ కోసం కృషి చేస్తానని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి 41వ జూనియర్‌ షూటింగ్‌బాల్‌ అండర్‌- 19 బాలబాలికల పోటీలను మంత్రి ప్రారంభించారు. మొదట కలెక్టర్‌ కె.శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌లతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, జడ్పీఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. క్రీడలకు తొర్రూరు పుట్టినిల్లుగా మారిందన్నారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదœపడతాయన్నారు. తొర్రూరులో మినీస్టేడియం ఏర్పాటుకు స్థలాన్ని సేకరించాలని ఆర్డీవో రమేష్‌ను మంత్రి ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్‌ కె.శశాంక మాట్లాడుతూ రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 56 జట్లు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు మూడురోజుల పాటు జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నవంబర్‌ 13 నుంచి 15 వరకు మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో  పాల్గొంటారన్నారు. మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌హై, ఆర్డీవో రమేష్‌, డీఎస్పీ రఘు, మున్సిపల్‌ ఛైర్మన్‌ రామచంద్రయ్య, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, తెరాస మండలాధ్యక్షుడు సీతారాములు, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ సురేందర్‌రెడ్డి కౌన్సిలర్లు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని