అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు.
కలెక్టరేట్లో కేంద్ర మంత్రి జైశంకర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లుతో కలిసి రిటర్నింగ్ అధికారి హన్మంత్ కె. జెండగేకు మరో సెట్టు నామపత్రం సమర్పిస్తున్న భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
భువనగిరి, న్యూస్‌టుడే: ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ పురస్కరించుకుని మంగళవారం అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక వినాయక చౌరస్తాలో రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ముస్లింల ఓట్ల కోసం మజ్లిస్ పార్టీకి రేవంత్‌రెడ్డి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. డాక్టర్‌గా వృత్తిలో రాణిస్తూ, మాజీ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధికి సేవలు అందించిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌ను లోక్‌సభకు పంపి మోదీని తిరిగి ప్రధాని చేయాలన్నారు. అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ధనం, అధికార అహంకారంతో తనను ఓడించేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కుట్రచేస్తున్నారని ఆరోపించారు.
- అభ్యర్థి నర్సయ్యగౌడ్ ఒక సెట్టు నామినేషన్ వేసినా.. భాజపా శ్రేణులు వెంటరాగా మరో సెట్టు నామపత్రాన్ని కేంద్ర మంత్రి జైశంకర్, డాక్టర్ లక్ష్మణ్, శాసన సభాపక్ష నేత మహేశ్వరెడ్డితో కలిసి వేశారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీలో కోలాహలంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు జి.మనోహర్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్, జనగామ, నల్గొండ, భువనగిరి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, వర్షిత్‌రెడ్డి, పాశం భాస్కర్, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమతి లేని క్లినిక్‌లు.. అర్హత లేకున్నా చికిత్సలు
[ 03-05-2024]
ఉమ్మడి వరంగల్‌లో వైద్యం వ్యాపారమైంది. నకిలీ వైద్యులు దీన్ని వ్యాపారంగా మలుచుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 75 శాతం నకిలీ వైద్యులు ప్రైౖవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ క్లినిక్‌ల పేరిట చిన్నస్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. -
వసతులు కల్పిస్తేనే పండగలా పోలింగ్
[ 03-05-2024]
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇప్పటికే భారత ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఎన్కౌంటర్లో చనిపోయింది సుష్మిత కాదా..!
[ 03-05-2024]
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. వీరిలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సూధన్పల్లికి చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు తిక్క సుష్మిత -
పాత వారికి ప్రాధాన్యం.. కొత్త వారికి గౌరవం
[ 03-05-2024]
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న పాత వారికి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వారిని గౌరవించుకుందామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
మోదీ నాయకత్వంలో దేశం పురోగతి
[ 03-05-2024]
మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం రాత్రి ఐనవోలు మండల కేంద్రంలో నిర్వహించిన భాజపా కార్నర్ మీటింగ్‌లో కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌తో కలిసి మాట్లాడారు. -
అమలుకు నోచని హామీలతో కాంగ్రెస్ మోసం
[ 03-05-2024]
అమలుకు నోచని హామీలతో మోసం చేసి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ భారాస అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్ అన్నారు. -
‘భాజపావి బ్లాక్మెయిల్ రాజకీయాలు’
[ 03-05-2024]
దేశంలో మరోసారి అధికారంలోకి రావడానికి భాజపా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విమర్శించారు. -
దేశం కోసం మరోసారి మోదీ..
[ 03-05-2024]
దేశం కోసం, ధర్మం కోసం మూడోసారి మోదీని ప్రధాని కావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, 400కు పైగా పార్లమెంటు స్థానాల్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే టి.వెంకటరమణారెడ్డి, భువనగిరి లోక్‌సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. -
నేటి నుంచి ‘ఇంటి వద్ద ఓటింగ్’
[ 03-05-2024]
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు, 85 ఏళ్లపై బడిన ఓటర్లు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
ఎండలు బాబోయ్..
[ 03-05-2024]
జిల్లాలో రోజురోజుకు ఎండ దంచి కొడుతోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి.. జన సంచారం లేక రోడ్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
ఇంటి నుంచి ఓటుకు అర్హులు 866
[ 03-05-2024]
పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు తమ ఓటు హక్కును తాము ఉన్నచోటనే వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ వర్గాలవారికి అవకాశం కల్పించింది. -
టీ హబ్‌కు జబ్బు
[ 03-05-2024]
ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ‘టీ హబ్’కు జబ్బు చేసింది. సుమారు 20 రోజులుగా పరీక్షలు నిర్వహించడం లేదు. విద్యుత్తు సమస్య కారణంగా యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అభ్యర్థులు నచ్చకపోతే.. నోటా
[ 03-05-2024]
రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటుహక్కు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు దీన్ని వినియోగిస్తారు. ఒకవేళ వారెవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)ను సంధించొచ్చు. -
ఓట్ల గని ఎవరికో?
[ 03-05-2024]
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. రోజురోజుకు ఎన్నికల వేడి రాజుకుంటోంది.. రాష్ట్రానికి వెలుగులు నింపే సింగరేణి నల్లసూరీల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మిక ఓటర్లు ప్రభావం చూపనున్నారు. -
ఇంటి నుంచి ఓటుకు స్పందన కరవు
[ 03-05-2024]
ప్రతీసారి ఎన్నికల్లో వృద్ధులు.. దివ్యాంగులు అతికష్టం మీద పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం చూస్తుంటాం. అయితే గత శాసనసభ ఎన్నికల నుంచి ఇంటివద్దే ఓటువేసేందుకు వారికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. -
పొదుపు సంఘాలకు సోలార్ ప్లాంట్ల నిర్వహణ
[ 03-05-2024]
ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పొదుపు సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా బలపడే విధంగా ప్రభుత్వాలు మరో అవకాశం కల్పించాయి. -
వల పన్నారు.. రూ.5 కోట్లకు ముంచారు!
[ 03-05-2024]
వరంగల్ నగరానికి చెందిన ఓ ఉద్యోగి అడ్డదారిలో భారీగా సంపాదించాలనుకున్నాడు. మరో ఇద్దరిని కలుపుకొని స్థానికంగా ఉండే ఓ బడా పత్తి వ్యాపారికి వల వేశారు. -
సెలవులో ఉద్యోగి.. కదలని దస్త్రాలు
[ 03-05-2024]
గ్రేటర్ వరంగల్ టౌన్‌ప్లానింగ్ విభాగం తీరు ఎవరికి వారే అన్నట్లుగా ఉంది. పెద్ద భవనాల అనుమతులు పెద్ద సార్లు, చిన్నాచితక భవనాల అనుమతులు కిందిస్థాయి అధికారులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM