logo

ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..

జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి  పాలిస్తాయని..

Published : 24 Apr 2024 02:55 IST

మీకు తెలుసా..

న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం: జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి  పాలిస్తాయని.. ప్రాంతీయ పార్టీలు స్థానికంగా ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటాయని సభలలో నేతలు చెబుతుంటారు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం... కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా పార్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లోని ఓట్లలో నాలుగు శాతం ఓట్లు వస్తే జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ ఒక ప్రాంతంలో (రాష్ట్రంలో) నాలుగు శాతం ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ, వ్యక్తులతో పార్టీ చీలిపోయినప్పుడు ఈ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని